గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

WNP: జిల్లాలోని నాగవరం వ్యవసాయ సొసైటీ కార్యాలయం వెనుక సుమారు 50-60 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు గురువారం వనపర్తి రూరల్ ఎస్సై హృషికేష్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712670613 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.