ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
ATP: గుంతకల్లు పట్టణ శివారులోని బళ్లారి సర్కిల్‌లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును సోమవారం అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వ స్థలాన్ని దేవేంద్రప్ప అనే వ్యక్తి ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టాడని రాజకీయ, కుల సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు.