మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు?
TG: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు మేనేజ్‌మెంట్ సూచిస్తుంది. ఈసారి పరీక్షల షెడ్యూల్‌లో ప్రతి సబ్జెక్టుకు మధ్య రెండు రోజుల విరామం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం అధికారులు 2, 3 ప్రత్యామ్నాయ షెడ్యూళ్లను సిద్ధం చేస్తున్నందున అధికారిక ప్రకటన కొద్దిగా ఆలస్యమవుతోంది.