మిస్ వరల్డ్ పోటీలు.. మీరు కూడా వెళ్లొచ్చు!

మిస్ వరల్డ్ పోటీలు.. మీరు కూడా వెళ్లొచ్చు!

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు సామాన్యులు కూడా రావొచ్చని సీఎంవో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలు మే 10న ప్రారంభం అవుతాయని, ఆసక్తి ఉన్నవాళ్లు టూరిజం వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకుని పాస్ కలెక్ట్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల బామలు పాల్గొననున్నారు.