పాము కాటుతో మహిళ మృతి
తిరుపతి సాంస్కృతిక విశ్వవిద్యాలయం (NSU)లో పాము కాటుకు ఓ మహిళ మృతి చెందింది. చంద్రగిరి మండలం పనపాకం అంబేద్కర్ కాలనీకి చెందిన హేమలత (35) ఔట్‌సోర్సింగ్ విధానంలో గార్డెన్ వర్కర్‌గా పనిచేస్తోంది. గ్రౌండ్ క్లీనింగ్ చేస్తుండగా కుడి కాలిపై పాము కాటువేసింది. సహచరులు ఆమెను రుయా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.