భాస్కర్ రెడ్డికి నివాళులర్పించిన గోరంట్ల మాధవ్

భాస్కర్ రెడ్డికి నివాళులర్పించిన గోరంట్ల మాధవ్

ATP: జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆదివారం తోపుదుర్తి గ్రామంలో భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు.