సమస్యల పరిష్కారానికి పైలట్ ప్రజావాణి: కలెక్టర్

ADB: ప్రజల సమస్యల పరిష్కారానికి పైలట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు అందజేసిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి సమస్యలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.