'భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి'
VZM: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన వ్యవహరించారని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.