మండల పంచాయతీ అధికారిగా అంకం శ్రీశైలం
MDK: పాపన్నపేట మండల పంచాయతీ అధికారిగా అంకం శ్రీశైలం నియామకం అయ్యారు. ప్రభుత్వం వెలువరించిన గ్రూప్ 2 ఫలితాల్లో భాగంగా ఎంపీవోలకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయికి చేరవేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.