యూరియా కోసం రైతుల కష్టాలు: కార్డుల పంపిణీతో పరిష్కారం
MHBD: ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బయ్యారం ఏవో రాజు వినూత్నంగా రైతులకు కార్డులు పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఈ కార్డులను అందించినట్లు ఆయన తెలిపారు.