శిల్పి పేరిట ప్రపంచ వారసత్వ గుర్తింపు !!

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. క్రీ.పూ. 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంనాటి ఈ ఆలయం దేవుడి పేరుతో కాకుండా ఆలయ శిల్పి 'రామప్ప' పేరుతో రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యునెస్కో వారసత్వ గుర్తింపు పొంది, చారిత్రక వైభవాన్ని చాటుతోంది.