ఆర్డీటీ FCRA సమస్యపై కేంద్ర హోంమంత్రి స్పందన

ఆర్డీటీ FCRA సమస్యపై కేంద్ర హోంమంత్రి స్పందన

సత్యసాయి: జిల్లాలో ఆర్డీటీ సంస్థకు విదేశీ నిధులు నిలిచిపోవడం నేపథ్యంలో, హిందూపురం ఎంపీ పార్థసారథి, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. ఆర్డీటీ FCRA రెన్యూవల్ అంశంపై వివరాలు తెలిపారు. వారం రోజుల్లో అనుకూల నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.