VIDEO: CISF జవాన్ మృతి.. అధికార లాంఛనాలతో నివాళి

VIDEO: CISF జవాన్ మృతి.. అధికార లాంఛనాలతో నివాళి

BHPL: చిట్యాల మండలం రామ్‌నగర్ కాలనీకి చెందిన CISF జవాన్ ఆరేపల్లి రమేశ్ (39) అనారోగ్యంతో సోమవారం రాత్రి హైదరాబాద్ ఆస్పత్రిలో మృతి చెందారు. మంగళవారం చిట్యాలలో అధికార లాంఛనాలతో CISF జవానులు జాతీయ జెండా, పూలమాలలతో నివాళులర్పించారు. అంత్యక్రియల అనంతరం మృతుడి భార్య సుమలతకు జాతీయ జెండా అందజేసి సన్మానించారు. జవాన్ మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.