ఆలయ సిబ్బందికి యూనిఫార్మ్ పంపిణీ

ఆలయ సిబ్బందికి యూనిఫార్మ్ పంపిణీ

TPT: నాగలాపురంలోని సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం సిబ్బందికి యూనిఫార్మ్‌లు పంపిణీ చేశారు. ఆలయ ఛైర్మన్ డి. పద్మనాభరాజు, ఈవో పి. లత చేతుల మీదుగా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి యూనిఫార్మ్‌లు అందజేశారు. విధులకు హాజరవుతున్నప్పుడు తప్పనిసరిగా యూనిఫార్మ్ ధరించి ఐడీ కార్డు ధరించాలని సూచించారు.