ఆసుపత్రి ఆవరణలో జింక హల్‌చల్

ఆసుపత్రి ఆవరణలో జింక హల్‌చల్

నాగర్‌ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక్కసారిగా జింక కనిపించడంతో స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని జింకను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా జింక ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం వాహనంలో అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలిపారు.