T20Iల్లో 3 సార్లు.. అభిషేక్ సరికొత్త రికార్డు
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. T20Iలో తొలి బంతికే సిక్సర్ బాదడం అతడి కెరీర్‌లో ఇది మూడోసారి. ఇప్పటివరకు భారత్ నుంచి రోహిత్, జైస్వాల్, సంజూ శాంసన్ కేవలం ఒక్కసారి మాత్రమే తొలి బంతికి సిక్సర్ కొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌లో అభిషేక్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.