జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

NRPT: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీడీవో, ఎంపీవో, మున్సిపల్ కమిషనర్లు, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ నెల 21 వరకు లబ్ధిదారుల జాబితా ఎంపీడీవో ఆఫీసులకు చేరుతుందని చెప్పారు.