బాలుర హాస్టల్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NTR: విస్సన్నపేటలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహ నిర్మాణానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పాడైపోయిన పాత భవనాలను తొలగించి నూతన వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తోందన్నారు.