ఆర్టీసీ బస్సుల్లో 1,65,604 మంది ప్రయాణం

RR: రాఖీ పండుగ సందర్భంగా షాద్ నగర్ డిపో నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ ఉష తెలిపారు. 3 రోజుల్లో రూ.1.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణించి మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, మూడు రోజుల్లో కలిపి 1,65,604 మంది ప్రయాణించినట్లు తెలిపారు.