ఘనంగా ఘంటసాల 103వ జయంతి వేడుక
BDK: భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అపరగాయకుడు ఘంటసాల 103వ జయంతి సందర్భంగా కాసిం మెగా ఈవెంట్స్ వెంకటేశ్వర కళానాట్య మండలి, పాల్వంచ కళాకారుల ఆధ్వర్యంలో ఆదివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.