అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి

అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి

CTR: కుప్పం మండలం టీ. అగ్రహారానికి చెందిన ఇంద్రజ (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడేళ్ల క్రితం ఇంద్రజకు మేనమామ పెరుమాళ్‌‌తో వివాహమైంది, వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రజ ఏడు నెలలు గర్భవతి. ఉద్యోగ నిమిత్తం పెరుమాళ్ కత్తర్ దేశంలో ఉంటున్నాడు. ఇవాళ ఉదయం ఈమె ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.