జాకారం గురుకుల పాఠశాలలో జోన్ స్థాయి క్రీడా పోటీలు
MLG: జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాలలోని మైదానంలో 11వ కాళేశ్వరం జోన్ స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. అదనపు కలెక్టర్ మహేందర్ జీ పోటీలను ప్రారంభించారు. 11 గురుకులాల నుంచి 935 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ క్రీడల్లో 14, 17, 19 ఏళ్ల విభాగాల్లో ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి.