మల్టీ లెవెల్ సాగుతో మహిళా రైతు విజయగాథ
BPT: చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన మహిళా రైతు ఎం. లక్ష్మీ తిరుపతమ్మ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్నారు. SERP సహకారంతో రెండు ఎకరాల్లో మల్టీ లెవెల్ విధానంలో పూలతో పాటు పచ్చిమిర్చి అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ విధంగా వ్యవసాయం చేసి ఏటా సుమారు రూ. 4.5 లక్షల టర్నోవర్ సాధించి రూ. 2.35 లక్షల నికర లాభం పొందుతున్నారు.