సర్వేను పరిశీలించిన కలెక్టర్

JN: జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ సర్వే ప్రక్రియను కలెక్టర్ రిజ్వాన్ భాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు.