'మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదు'
WGL: జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని తెలిపారు. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని, మేడారం జాతరకు కూడా ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ జాతరలపై అమితమైన ప్రేమ, నమ్మకం ఉందని, ఈ విషయంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రతిపాదన చేయలేనని స్పష్టం చేశారు.