ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
NRML: అంధకారాన్ని పారదోలి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి పండుగ అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంట్లో వెలుగు,సంతోషం,శాంతి నింపాలని ఆమె ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు భద్రతా సూచనలు జారీ చేశారు.