అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
SKLM: కోటబొమ్మాళి(M) ఎత్తురాళ్ల పాడు జాతీయ రహదారిపై మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టెక్కలి నుంచి నారాయణ వలస సంతకు పశువులతో వెళ్తున్న ఒక వాహనాన్ని ఎస్సై సత్యనారాయణ అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 8 దూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.