' రైతున్నా-మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

' రైతున్నా-మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: మంగళవారం కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నెలో ‘రైతన్నా-మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి సీఎం సందేశ పత్రం అందజేశారు. రైతులతో నేరుగా మాట్లాడి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాల గురించి వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.