నలుగురు వైసీపీ కార్యకర్తలు సస్పెండ్..!
ప్రకాశం: కనిగిరి నియోజకవర్గానికి చెందిన నలుగురు వైసీపీ కార్యకర్తలను పార్టీ అధిష్టానం మంగళవారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో మురళీకృష్ణ, తిరుపతమ్మ, సుబ్బారెడ్డి సహా నలుగురిపై నియోజకవర్గ నాయకులు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలను పరిశీలించిన అనంతరం వారిని పార్టీ నుండి తొలగిస్తూ అధిష్టానం అధికారిక ప్రకటన విడుదల చేసింది.