పోలీస్ స్టేషన్ సందర్శించిన సీపీ
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌ను ఇవాళ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చేలా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజల్లో కల్పించాలని అన్నారు.