VIDEO: జలదిగ్బంధంలో గుడివాడ బస్టాండ్

కృష్ణా: గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపించేలా వర్షపు నీటితో మునిగిపోయింది. రాకపోకల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రత్యేక మోటార్లతో నీటిని బయటకు తోడే చర్యలు ముమ్మరం చేశారు.