అమ్మవారి జాతరకు మంత్రికి ఆహ్వానం

W.G. పాలకొల్లు పట్టణం లాకుదిగువ కొలువై ఉన్న శ్రీ దేశాలమ్మ అమ్మవారి 53వ జాతర మహోత్సవాలు మే నెల 19 నుండి 25 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జాతర మహోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ.. చింతల తోట యువజన సంఘం కమిటి సభ్యులు మంత్రి నిమ్మల రామానాయుడుకి ఆదివారం దేశాలమ్మ అమ్మవారి చిత్రపటంతో పాటు ఆహ్వాన పత్రిక అందజేశారు.