అండర్ 19 క్రికెట్ జట్టుకు జిల్లా వాసులు ఎంపిక

ATP: అనంతపురంలోని తపోవనం నుంచి ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ స్టేట్ ప్రాబబుల్ జట్టుకు చక్రీక, హిమవర్షిని ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం తపోవనం అసోసియేషన్ సభ్యులు మనోజ్, మదన్‌మోహన్ రెడ్డి, మురళీలు మాట్లాడుతూ.. జులై 2వ తేదీ నుంచి నిర్వహించే స్టేట్ ప్రాబబుల్స్‌కు తపోవనం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పలువురు వారిని అభినందించారు.