నాటు సారాయి విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు

నాటు సారాయి విక్రయిస్తున్న ఒకరిపై కేసు నమోదు

NRML: కడెం మండలంలోని మద్దిపడగ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ నాటుసారాయి విక్రయిస్తున్న సమయంలో పట్టుకోవడం జరిగిందని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్‌స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఆమె వద్ద నుంచి 15 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్‌స్పెక్టర్ అభిషేకర్, వసంతరావు, సిబ్బంది రషీద్, వెంకటేష్ ఉన్నారు.