పాఠశాలలో మద్యం సీసాలు

NLG: నార్కట్‌పల్లి మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలకు రాత్రిపూట కొంతమంది వచ్చి బీర్లు, మందు తాగి సీసాలను పగలగొట్టి క్లాస్ రూములలో వెదజల్లుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం తెలిపారు. సీసాలు పగలగొట్టడం వల్ల పిల్లలకు గుచ్చుకొని గాయాలు అయ్యే అవకాశం ఉంది. కావున గ్రామ పెద్దలు ఈ చర్యకు పాల్పడుతున్నది ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాల్సిందిగా కోరారు.