గ్యార్మి వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
మహబూబ్ నగర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూర్ పురపాలక పరిధిలో నిర్వహించిన గ్యార్మి వేడుకలకు ఇవాళ హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ అల్లా ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బసవరాజు గౌడ్ పాల్గొన్నారు.