పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VZM: కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1980- 81 సంవత్సరంలో చదువుకున్న పదోతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరు పలకరించుకుని, కుటుంబ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోజంతా ఆట పాటలతో సందడి చేశారు. ఆనాడు చేసిన అల్లరిని నేమరువేసుకొన్నారు. ఆనంతరం పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.