లింగాల గణపురంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
JN: లింగాల గణపురంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరేందుకు యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నేతలు పాల్గొన్నారు.