VIDEO: జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో మరో నిందితుడు అరెస్టు

SRPT: సూర్యాపేటలోని సంతోషి జ్యువెలరీ షాప్‌లో బంగారం చోరీ ఘటనలో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఏ5 నిందితుడు జషీముద్దీన్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 25 తులాల బంగారం,రూ 4.80 లక్షల నగదును రికవరీ చేసినట్లు తెలిపారు.