సింగరేణి ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

MNCL: పద్మావతి కాలనీలో సింగరేణి ఉద్యోగి మేకల రాజయ్యకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. భూపాలపల్లిలో పనిచేస్తున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించి రాత్రి నిద్రపోయారు. ఉదయం 3 గంటలకు లేచేసరికి ఇంట్లోని బ్యాగ్‌లో ఉన్న రూ.2.86 లక్షల విలువ గల 13 తులాల బంగారు ఆభరణాలు కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.