ఇంటర్ విద్యార్థులకు ఫైనల్ ఛాన్స్

ఇంటర్ విద్యార్థులకు ఫైనల్ ఛాన్స్

TG: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల గడువు పొడిగిస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు 20తో సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసింది. కానీ, తాజాగా ఆగస్టు 31వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్ కోసం ఇదే చివరి అవకాశం అని తెలిపింది. అర్హులైన విద్యార్థులు వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.