అఖిలేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: శ్రీకాంత్
ADB: అలెంబిక్ ఫార్మా యాజమాన్యం పని ఒత్తిడి కారణంగా హైదరాబాదులో పనిచేస్తున్న ఉద్యోగి అఖిలేష్ బలవన్మరణానికి పాల్పడటం అత్యంత బాధాకరమని TMSRU జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. యాజమాన్య వైకిరిని నిరసిస్తూ బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అలెంబిక్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.