VIDEO: శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ ఉగ్ర నారసింహ స్వామివారి దేవస్థానంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచోపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.