ఈనెల 24న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాబ్ మేళా
HNK: సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉద్యోగ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 12 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల అభ్యర్థులు కూడా పాల్గొనే వీలుందని స్పష్టం చేశారు.