వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్.

వేసవిని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను తిరుపతి జిల్లా డా. ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నపుడు ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు.