సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
PDPL: పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ పేర్క రిబ్కా శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని పేర్కొన్నారు.