ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించిన సీఐ

ట్రాఫిక్ చట్టాలపై అవగాహన కల్పించిన సీఐ

కాకినాడ కల్పన సెంటర్‌లో వాహనదారులు, డ్రైవర్లకు ట్రాఫిక్‌ నిబంధనలపై కాకినాడ ట్రాఫిక్‌-1 సీఐ నూని రమేశ్ శనివారం సాయంత్రం అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని, కొత్త ట్రాఫిక్‌ చట్టాలను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని, మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.