మొదటి విడతలో 262 గ్రామాలు
VKB: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తొలి విడతగా వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవెన్యూ డివిజన్ మండలాలు తాండూర్, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్, దుద్యాల్లో మొత్తం 262 గ్రామ పంచాయతీలు, 2198 వార్డుల్లో పోలింగ్ జరగనుంది.