డ్రోన్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట

డ్రోన్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట

VZM: జిల్లాలో నేరాల నియంత్రణకు డ్రోన్‌ని వినియోగిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం వెల్లడించారు. ముఖ్యంగా ఈవ్ టీజింగ్, కోడిపందేలు, పేకాట, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.