సోమలలో పసిబిడ్డను వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
చిత్తూరు జిల్లా సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ ఎర్రంవారి పల్లిలో దారుణం చోటుచేసుకుంది. పేడదిబ్బలో గుర్తు తెలియని వ్యక్తులు పసిబిడ్డను వదిలి వెళ్లారు. స్థానికులు శిశువును గమనించి సోమల పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యుల పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చిత్తూరుకు తరలించారు.